Fri Mar 20 2026 16:49:17 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ లోని ఆయన ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో [more]
మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ లోని ఆయన ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో [more]

మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ లోని ఆయన ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబుతో పాటు నారాయణకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈరోజు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నారాయణ ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లగా నారాయణ అందుబాటులో లేరు. దీంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందించారు. ఈ నెల 22వ తేదీన నారాయణ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Next Story