Tue Mar 24 2026 19:43:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : దేవెగౌడతో బాబు భేటీ

జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు వివిధ పార్టీల నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన దేవెగౌడ, కుమారస్వామిలను కలిశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీంతోపాటుగా కర్ణాటకలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలపై కూడా చర్చించనున్నారు.
Next Story

