Sat Mar 07 2026 20:08:03 GMT+0530 (India Standard Time)
జగన్ ప్లానే ఇది
వైఎస్ జగన్ అమెరికాకు వెళుతూ చంద్రబాబుకు ప్రాణహాని కలిగించమని క్యాడర్ కు ఆదేశాలిచ్చినట్లుందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న [more]
వైఎస్ జగన్ అమెరికాకు వెళుతూ చంద్రబాబుకు ప్రాణహాని కలిగించమని క్యాడర్ కు ఆదేశాలిచ్చినట్లుందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న [more]

వైఎస్ జగన్ అమెరికాకు వెళుతూ చంద్రబాబుకు ప్రాణహాని కలిగించమని క్యాడర్ కు ఆదేశాలిచ్చినట్లుందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగరడానికి కారణం ఎవరు? ఎందుకు దానిని ఎగురవేశారని లోకేష్ ప్రశ్నించారు. ఇంతకీ ఈ కుట్రలో పాల్గొన్న కిరణ్ ఎవరు అని లోకేష్ నిలదీశారు. గ్రామాలన్నీ మునిగిపోతున్నా చంద్రబాబు నివాసంపైన వైసీపీ నేతలకు అంత శ్రద్ధ దేనికని లోకేష్ ప్రశ్నించారు. జగన్ కుట్రకు నీటిపారుదల శాఖ వంతపాడుతుందని విమర్శించారు. తమ కార్యకర్తలపై అమానుషంగా లాఠీఛార్జి చేశారని లోకేష్ ఆరోపించారు.
Next Story