Wed Mar 18 2026 02:15:41 GMT+0530 (India Standard Time)
బాధితులపైనే కేసులు నమోదు చేస్తారా?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేవినేని ఉమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. దేవినేని ఉమపై రాజారెడ్డి రాజ్యాంగాన్ని [more]
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేవినేని ఉమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. దేవినేని ఉమపై రాజారెడ్డి రాజ్యాంగాన్ని [more]

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేవినేని ఉమ అరెస్ట్ ను ఆయన ఖండించారు. దేవినేని ఉమపై రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించారని లోకేష్ ఆరోపించారు. ఉమపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులను అరెస్ట్ చేయడమేంటని లోకేష్ ప్రశ్నించారు. ఇలాంటి పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ ఉండదని ఆయన తెలిపారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నారా లోకేష్ నిలదీశారు.
Next Story