Wed Mar 18 2026 02:00:25 GMT+0530 (India Standard Time)
గవర్నర్ కు లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు అనుసరించిన [more]
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు అనుసరించిన [more]

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు అనుసరించిన విధానంపై లోకేష్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. డిజిటల్ వాల్యూయేషన్ పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని లోకేష్ తన లేఖలో కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా కొందరిని నియమించారని, వారి వల్ల గ్రూపు వన్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని నారా లోకేష్ తెలిపారు. ఎటువంటి అధ్యయనం లేకుండా డిజిటల్ వాల్యూయేషన్ ను ఎంచుకోవడం సరికాదని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story