Tue Mar 17 2026 11:22:08 GMT+0530 (India Standard Time)
ఇప్పుడా గుర్రపు స్వారీలు చేసేది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే వైసీపీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే వైసీపీ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే వైసీపీ నేతలు సరదాల్లో మునిగి తేలుతున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కరోనా వ్యాప్తి జరుగుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైసీపీనేతలు గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్నారన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీలు చేస్తుండటమేమిటని నారా లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ లేదు కాని, వైసీపీ నేతల ఎంజాయ్ కు మాత్రం కొదవలేదని నారా లోకేష్ సెటైర్ వేశారు.
Next Story