Sun Mar 22 2026 01:20:48 GMT+0530 (India Standard Time)
జగన్ కు థ్యాంక్స్… ఈ పని కూడా చేయండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. మూడువారాల పాటు ఆందోళన చేసిన తర్వాత ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందుకు జగన్ కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. మే నెలలో జరిటే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేయాలని, లేదంటే రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. కరోనా పరీక్షలను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. ఆసుపత్రుల్లో పడకల కొరత, ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడిపోతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story