Fri Dec 19 2025 02:24:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దీక్షకు దిగనున్న లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు నిరసన దీక్ష చేయనున్నారు. ఇసుక కొరతపై ఆయన ఆందోళనకు దిగనున్నారు. రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం [more]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు నిరసన దీక్ష చేయనున్నారు. ఇసుక కొరతపై ఆయన ఆందోళనకు దిగనున్నారు. రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం [more]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు నిరసన దీక్ష చేయనున్నారు. ఇసుక కొరతపై ఆయన ఆందోళనకు దిగనున్నారు. రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నారా లోకేష్ దీక్ష చేయనున్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. గత కొంత కాలంగా ట్విట్టర్ లో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నారా లోకేష్ నేరుగా ఒకరోజు దీక్ష చేయనున్నారు.
Next Story