Mon Feb 02 2026 15:53:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇక చూస్కోండి అంటున్న లోకేష్

ఏపీలో పెట్టుబడుల వెల్లువ వస్తుందని మంత్రి నారాలోకేష్ అన్నారు. కొద్దిసేపటిక్రితం ఆయన ఏపీ రాజధాని అమరావతిలో పది ఐటీ కంపెనీలను ఒక్కసారి లోకేష్ ప్రారంభించారు. దీనివల్ల తక్షణమే 300 మందికి ఉద్యోగాలు వస్తాయని, తర్వాత వెయ్యి మంది వరకూ ఈకంపెనీల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐటీ కంపెనీలు వచ్చి భూమి కావాలంటే తక్షణమే ఇస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందుతున్న తీరును చూసే కంపెనీలు ఏపీ వైపుకు దూసుకువస్తున్నాయన్నారు. కొన్ని సమస్యలు ఉన్నా నెమ్మదిగా అధిగమిస్తామన్నారు. 1995లో ఇదే సమస్య హైదరాబాద్ లో ఉండేదని, దానిని చంద్రబాబు అధిగమించారన్నారు. రాజధాని అమరావతిలోనూ ఐటీ కంపెనీలు త్వరలోనేక్యూ కడతాయన్న విశ్వాసాన్ని మంత్రి లోకేష్ వ్యక్తం చేశారు.
Next Story
