Sat Mar 21 2026 07:42:09 GMT+0530 (India Standard Time)
పవన్, లోకేష్ లపై శ్రీరెడ్డి కామెంట్స్

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న నటి శ్రీరెడ్డి మంగళవారం పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేశారు. ‘మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికై, ఒక్క పైసా అభివృద్ధి చేయలేదని ప్రజలకు తెలుసు. ఓర్పుగా ఉండటం సినిమా డైలాగ్స్ కొట్టి నీళ్లు తాగినంత సులువు కాదు. మీ అన్న రాజకీయాలు, సినిమాల్లో ఎంతమందిని తొక్కాడో ఎవరికి తెలియది?’ అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు ఈ ఇష్యూలోకి నారా లోకేష్ ను తీసుకువచ్చింది. ‘నారా లోకేష్ గారిని ఎవరైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పంది. అంతేగానీ లోకేష్ ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు’ అని స్పష్టం చేసింది.
Next Story

