Thu Mar 26 2026 12:18:52 GMT+0530 (India Standard Time)
తెలంగాణ ఎన్నికలపై నారా జోస్యమిదే

తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారాలోకేష్ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం ఖాయమైపోయిందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, అలాగే అక్కడ అధికార పార్టీకూడా ధనిక పార్టీయేనని చమత్కరించారు. టీఆర్ఎస్ నేతలు ఓటమి అంచున ఉన్నారని తెలిసి, చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు చేసిన అభివృద్ధి తర్వాత ఏం చేశారో కేసీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఏపీ ఎన్నికల్లో స్వేచ్ఛగా వచ్చి కేటీఆర్ ప్రచారం చేసుకోవచ్చన్నారు. దీనికి ఇంకా కేటీఆర్ కు ఆరు నెలల సమయం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు ఎక్కడ అడ్డుకున్నారో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు.
Next Story

