Fri Mar 20 2026 17:56:29 GMT+0530 (India Standard Time)
లోకేష్ ట్వీట్ లో వైఎస్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఉపయోగించుకుంటూ వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. పోలవరం పనులను చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో వేగంగా పూర్తి చేస్తుంటే సిగ్గు లేకుండా వైఎస్ హయాంలోనే పనులు వేగంగా జరిగాయని చెప్పడాన్ని లోకేష్ తప్పుపట్టారు. వైఎస్ కల పోలవరం అంటూ ఆయన పేరును తెస్తున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే విజయానికి మాత్రం ఎంతో మంది తండ్రులని, అపజయం మాత్రం అనాధ అన్నది తనకు గుర్తుకు వస్తుందని లోకేష్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే 55 శాతం పూర్తయిందన్న విషయాన్ని గుర్తు చేశారు.
- Tags
- andhra pradesh
- ap politics
- nara chandrababu naidu
- nara lokesh
- polavaram
- telugudesam party
- tweet
- y.s. jaganmohan reddy
- y.s.rajasekhar reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- ట్వీట్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- నారా లోకేష్
- పోలవరం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

