Mon Feb 02 2026 20:13:54 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ మాటలు విన్నారంటే....!

తాను పుట్టేనాటికే తన తాత ముఖ్యమంత్రి అని, పాఠశాలకు వెళ్లేనాటికే తండ్రి ముఖ్యమంత్రి అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అయినా, తనపైన ఏనాడు అవినీతి ఆరోపణ రాలేదని గుర్తు చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీతో జగన్, పవన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. బీజేపీ అంటే ‘భారతీయ జగన్ పవన్’ పార్టీ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించడం లేదన్నారు. జగన్, పవన్ ఇప్పటికైనా కులాల మధ్య చిచ్చుపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ మొత్తం 175 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీకి 25 పార్లమెంట్ సీట్లలో గెలిపించాలని, అలా అయితే దేశ ప్రధానిని మనమే నిర్ణయిస్తామని, ప్రత్యేక హోదా సాధిస్తామని పేర్కొన్నారు.
Next Story

