Sat Mar 07 2026 20:08:23 GMT+0530 (India Standard Time)
జగన్ నీ చెత్త నిర్ణయాలు ఇక ఆపు
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు చనిపోతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ట్విట్టర్ లో [more]
జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు చనిపోతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ట్విట్టర్ లో [more]

జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు చనిపోతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. సజావుగా సాగిపోతున్న పాలనను గాడి తప్పించి రైతుల మరణాలకు కారణమవుతున్నారని లోకేష్ మండి పడ్డారు. కృష్ణాయపాలెంలో రైతు కృపానందం మృతి తనను కలచివేసిందన్న లోకేష్ రైతులను మానసికంగా వేధించవద్దని కోరారు. రాజధాని అమరావతి తరలింపు విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని లోకేష్ కోరారు.
Next Story