Mon Mar 23 2026 20:08:21 GMT+0530 (India Standard Time)
వైసీపీ కోడి కత్తి డ్రామా

వైసీపీ కోడి కత్తి డ్రామా ఆడిందని మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ కు ఇటువంటి కుట్రలు అలవాటేనని లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం, సానుభూతి పొందడం కోసమే కోడికత్తి డ్రామా ను వైసీపీ నేతలు రక్తికట్టించారన్నారు. ఇటువంటి కుట్రలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరని లోకేష్ అన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ కు అలవాటేనన్నారు. నిన్న జరిగిన సంఘటన ప్రజలకు పూర్తిగా అర్థమయిందన్నారు లోకేష్.
Next Story

