Thu Mar 26 2026 01:08:18 GMT+0530 (India Standard Time)
జగన్ కు జైలుకు వెళ్తానన్న భయమే

కోడికత్తి డ్రామా ఆడుతున్న జగన్ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు నోరుమెదపడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో భయం అన్నారు. మాట్లాడితే జగన్ జైలుకు వెళతారన్న భయమని చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో ఆయన పాల్గొన్నారు. అందుకే మోదీని పన్నెత్తు మాట కూడా అనడం లేదన్నారు. కోడికత్తి ఉత్త డ్రామా అని తేలిపోయిందన్నారు. కేంద్రం ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేసిందన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం పెట్టకుంటే తాను పెట్టి చూపిస్తానని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. ఎంపీలను బెదిరించడానికి ఈడీతో దాడులు చేయిస్తున్నారన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు.
Next Story

