Tue Mar 24 2026 03:41:41 GMT+0530 (India Standard Time)
బాబుకు అఖిలేష్ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోన్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ పార్టీలనూ కూడగడుతున్న చంద్రబాబు కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అందరం కలసి కట్టుగా పోరాడాల్సిందేనని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రయత్నానికి తాము అండగా ఉంటామని అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా చెప్పారు. త్వరలోనే తాను వచ్చి కలుస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
Next Story

