Mon Mar 23 2026 00:33:24 GMT+0530 (India Standard Time)
అంచనాలు పెంచడం ఆయనకు అలవాటే

అంచనాలు పెంచడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి అలవాటుగా మారిందని బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తిత్లి తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లా దెబ్బతిన్న మాట వాస్తవమేనని, అయితే చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖలో 2800 కోట్లు నష్టం జరిగినట్లు చూపడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణ సాయం కింద చంద్రబాబు వెంటనే విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాసిన సంగతి తెలిసిందే. దీనిపై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ అంచనాలు ఎక్కువ చేసి చూపించి, ఆ తర్వాత కేంద్రంసాయం చేయలేదని విమర్శించడానికే చంద్రబాబు ఈ ప్రయత్నాలన్నారు. తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
Next Story

