Tue Mar 24 2026 03:41:59 GMT+0530 (India Standard Time)
జగన్ ను పట్టించుకోవద్దన్న బాబు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి విషయాన్ని పట్టించుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ పై దాడి విషయంలో కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుండటం, జగన్ పట్ల సానుభూతి పెరుగుతుందన్న ఆందోళనతోనే చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కొందరు మంత్రులు ఈవ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి లేనిపోని తలనొప్పిని తెస్తున్నాయని బాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ వ్యవహారాన్ని పట్టించుకోవద్దని నేతలకు ఆయన సూచించారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
- Tags
- andhra pradesh
- ap politics
- attack
- kgh
- knife
- nara chandrababu naidu
- srinivas
- telugudesam party
- visakha airport
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కత్తి
- కేజీహెచ్
- తెలుగుదేశం పార్టీ
- దాడి
- నారా చంద్రబాబునాయుడు
- విశాఖ ఎయిర్ పోర్టు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- శ్రీనివాస్
Next Story

