Tue Mar 24 2026 07:55:01 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ తిట్టక పొగుడుతాడా...!!!

కేసీఆర్ నన్ను విమర్శించక పొగుడుతాడా అని నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను అంతగా డెవెలెప్ అయిందంటే దానికి కారణం ఎవరన్నారు? తాను ఒక విజన్ తో హైదరాబాద్ ను అభివృద్ధి చేశానన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణా లేదన్నారు. తాను కాక హైదరాబాద్ ను కేసీఆర్ అభివృద్ధి చేశారా? అని అన్నారు. విభజన జరిగిన తర్వాత తెలుగు ప్రజలందరం కలసి పనిచేయాలని తాను ఆలోచించానన్నారు. అమరావతిని ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చి దిద్దుతానని చెప్పారు. నన్ను కేసీఆర్ ఎందుకు తిడుతున్నారో తనకే తెలియదన్నారు. తెలంగాణలో తన ప్రమేయం లేదన్నారు. అది వేరే రాష్ట్రమని, తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోనే సమయం సరిపోతుందని చెప్పారు.
Next Story

