Mon Mar 23 2026 11:50:29 GMT+0530 (India Standard Time)
సీబీఐపై బాబు వ్యాఖ్యలివే...!

సీబీఐని కేంద్రం తనచెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.సీబీఐని స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయనీయడం లేదని ఆయనఅన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. అంతేకాదు ఒకపక్క అగ్రిగోల్డ్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా దానిపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, బీజేపీ నేతలపై కోర్టు థిక్కారం కేసు వేయాలని ప్రభుత్వం భావిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపైనా సీనియర్ మంత్రులతో చంద్రబాబు చర్చించారు.
Next Story

