Sat Jan 31 2026 12:52:24 GMT+0000 (Coordinated Universal Time)
దోపిడీకి గునపాలు చాలవు..ప్రొక్లెయిన్లు కావాల్సిందే

చంద్రబాబుకు ప్రతి ప్రాజెక్టూ ఉపాధి హామీ పథకంలా మారిందని బీజేపీ నేత సోమువీర్రాజు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం 16వేలకోట్ల నుంచి 53 కోట్లకు ఎందుకు పెరిగిందన్నారు. చంద్రబాబు దోపిడీకి గునపాలు చాలవని, ప్రొక్రెయిన్లు కావాలని సోము సెటైర్ వేశారు. పోలవరంలో రోజుకోసారి లెక్కలు ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించారు. ప్రతి పథకంలోనూ ఏపీలో అవినీతి జరుగుతుందన్నారు. చంద్రబాబుకు అవినీతిలో ఆస్కార్ ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. మోడీ లేకుంటే చంద్రబాబు జీరోయేనన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో చేసిన ప్రతి అభివృద్ధి పనీ కేంద్రం నిధుల నుంచీ జరుగుతుందేనన్నారు. గతంలోనూ చంద్రబాబు ఇదే రీతిలో వ్యవహరించారన్నారు. చంద్రబాబు చేసేవన్నీ అధర్మపోరాటాలనీ, వాటిని ప్రజలు ఎవరూ నమ్మరన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారన్నారు సోము వీర్రాజు.
Next Story
