Sat Mar 21 2026 07:21:14 GMT+0530 (India Standard Time)
చ్రందబాబుకు రెండోనోటీసు రెడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండో నోటీసు తీవ్రంగా ఉంటుందని సినీనటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్లీ కేసులో నోటీసులు ఇవ్వడం చంద్రాబాబును ట్రాప్ లో పడేయడానికేనని శివాజీ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రయివేటు విమానంలో తిరగవద్దని సలహా ఇచ్చారు. అది ఆయనకు ప్రమాదకరమని శివాజీ తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలందరూ ఇతర పార్టీల్లోకి వెళతారని, అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్నదే కేంద్రం ఆలోచనగా ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ తో పాదయాత్ర చేయడానికి ఆయనేమన్నా మహాత్మాగాంధీనా? అని ప్రశ్నించారు. ఏపీలో కుట్ర జరుగుతుందని గతంలోనే చెప్పానని, చంద్రబాబుకు వచ్చే రెండో నోటీసు తీవ్రంగా ఉంటుందని, జాగ్రత్తగా, న్యాయనిపుణులతో చర్చించి వ్యవహరించాలని సినీనటుడు శివాజీ సూచించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- second notice
- sivaji
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- రెండో నోటీస్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- శివాజీ
Next Story

