వైరల్ గా బాబు రాహుల్ లకలక వీడియో ....!

ఇప్పుడు సోషల్ మీడియా లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎపి సీఎం చంద్రబాబు చంద్రముఖి వీడియో హల్చల్ చేస్తుంది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన బాబు అక్కడ రాహుల్ తో కలిసి ప్రజలకు అభివాదం చేశారు. అంతే కాదు ఆయన భుజంపై చెయ్యి వేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఆ వీడియోను కొందరు చంద్రముఖి సినిమా బిట్ తో కలిపారు. సినిమాలో ప్రభు భార్య జ్యోతిక చంద్రముఖి గా పూర్తిగా ఎలా మారిపోయిందో చూడు అంటూ రజనీకాంత్ చూపిస్తారు.ఆ సీన్ లో బాబు, రాహుల్ లు కలిసి ఫోజు ఇచ్చిన వీడియో ఉంచి పూర్తిగా కాంగ్రెస్ వాదిగా మారిన చంద్రబాబు ను చూడు అనగానే రా రా అంటూ సీన్ ముగించారు.
పెద్దయెత్తున షేర్ చేస్తూ......
మంచి హాస్యంతో కుడి ఉండటంతో ఈ బిట్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా వైసిపి, జనసేన, బిజెపి గ్రూప్ సభ్యులు పెద్ద ఎత్తునే దీన్ని షేర్ చేస్తూ తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇస్తున్నారు. దీంతో బాటు మోడీ తో 2014 లో బాబు ఒకే వేదికపై అభివాదం చేస్తున్న బిట్ జోడించారు. నాడు.....నేడు అంటూ చంద్రబాబు రాజకీయ అస్పష్టతను తెలియచెప్పే ప్రయత్నం ప్రత్యర్ధులు గట్టిగానే ఎత్తి చూపారు. అవసరాన్ని బట్టి ఎవరితోనైనా అయన కలిసే స్వభావం ఉందని ఆయన చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతన ఉండదని ఒక్క ముక్కలో చెప్పేశారు. బాబు, రాహుల్ పై వచ్చిన ఈ వీడియో వైరల్ గా సర్క్యులేట్ కావడమే కాదు జనంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
- Tags
- andhra pradesh
- ap politics
- bangalore
- bharathiya janatha pary
- indian national congress
- janasena party
- kumaraswamy
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- rahul gandhi
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- కుమారస్వామి ప్రమాణస్వీకారం
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- బెంగుళూరు ఏపీ పాలిటిక్స్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రాహుల్ గాంధీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
