Tue Mar 24 2026 09:05:24 GMT+0530 (India Standard Time)
బాబు సినిమా ప్లాప్ అవ్వక తప్పదన్న పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమని జనసేనాని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు చూపించింది ట్రైలర్ మాత్రమేనని, సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తునికి రైలులో బయలుదేరిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఎక్కడ మొదలయిందో అక్కడికే చేరుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏపీలో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ తో జతకట్టారన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం వల్లనే సమీకరణ మారుతాయి తప్ప కూటములు వల్ల కాదన్నారు. చందరబాబు, కాంగ్రెస్ కలయిక చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం 2014లోనే తీసుకోవాల్సిందన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- indian national congress
- janasena party
- n.t.ramarao
- nara chandrababu naidu
- pavan kalyan
- rahul gandhi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఎన్టీరామారావు
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతజాతీయ కాంగ్రెస్
- రాహుల్ గాంధీ
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

