Sun Mar 22 2026 11:59:35 GMT+0530 (India Standard Time)
ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలా? వద్దా?

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసిన ధర్మాబాద్ కోర్టుకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు సీనియర్ నేతలు, న్యాయనిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు భారీ ర్యాలీతో కోర్టుకు వెళితే బాగుంటుందని సూచించారు. అయితే దీనికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. ఈ సమావేశానికి అడ్వకేట్ జనరల్ తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నారాయణ, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు, అమర్ నాధ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ లు హాజరయ్యారు. న్యాయనిపుణుల సలహా మేరకే నడుచుకోవాలని ఆయన నిర్ణయించారు
Next Story

