Tue Mar 24 2026 05:03:45 GMT+0530 (India Standard Time)
బాబు మరోసారి....అందుకేనా....?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలన్న ఉద్దేశ్యంతో హస్తిన టూర్ పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కూడా జాతీయ స్థాయిలో ఎండగట్టడం ఈ టూర్ వెనుక లక్ష్యంగా తెలుస్తోంది. చంద్రబాబు రేపు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. బీజేపీయేతర కూటమితో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చంద్రబాబు వారితో చర్చించనున్నట్లు సమాచారం.
Next Story

