Sat Mar 21 2026 15:48:57 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సీఎం అయితే ఏం?

బాబ్లీ కేసులో జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీకాల్ పిటిషన్ను తిరస్కరించారు. కోర్టుకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి అన్నారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హాజరుకావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Next Story

