బాబు సర్కార్ పై సిబి‘‘ఐ’’ తప్పదా..?

నీరు చెట్టు, బలహీన వర్గాల గృహాలు, ప్రధాన మంత్రి ఆవాస యోజన, పట్టిసీమ అవినీతి ఇలా అనేక అంశాలపై అవినీతి ఆరోపణలు మూటగట్టి సిబిఐ కి ఫిర్యాదు చేసేందుకు ఏపీ బిజెపి సిద్ధమైందా... ? అవుననే అంటున్నారు బిజెపి ఎంఎల్సీ, ఏపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఎప్పటి నుంచో చంద్రబాబు సర్కారుపై ఆరోపణలు, విమర్శలకు ఇక చెక్ పెట్టి సిబిఐ విచారణ కోరడానికి సమాయత్తం అయినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దేశానికే అత్యంత ప్రమాదకర రీతిలో చంద్రబాబు అవినీతిపాలన సాగుతుందని సోము నిప్పులు చెరిగారు. ఇక ఈ దుష్ట పాలనపై ప్రజా తిరుగుబాటు చేయాలిసిన తరుణం ఆసన్నమైందన్నారు. టిడిపి మట్టిని , ఇసుకను, వేలకోట్లరూపాయాల్లో దోచేసిందని ఆరోపించారు వీర్రాజు. దీనిపై అనేకసార్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానికి పోలేదని విమర్శించారు.
బాబు ఏ పార్టీ నో చెప్పాలి....
ఇందిరా గాంధీ అనుమతి ఇస్తే మామ ఎన్టీఆర్ పై పోటీ చేస్తానన్న చంద్రబాబు ఏ పార్టీ కి చెందిన వారో టిడిపి తేల్చాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టిపెరిగి ఆ రక్తం ప్రవహించే బాబు కుర్చీకోసం ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకు లాగేసిన రోజు ఆయనకు దండ వేసి దణ్ణం పెట్టడం విచిత్రమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ విషయాలు చెబుతున్నప్పుడు బిజెపి, వైసీపి జనసేన కలిసి పోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీర్రాజు విరుచుకుపడ్డారు. అసలు ఆయన పార్టీ కాంగ్రెస్ అని, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నవి మూడు పార్టీలన్నవి గుర్తు పెట్టుకోవాలన్నారు. టిడిపి, కాంగ్రెస్ , వైసిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ విమర్శలు చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. వైసిపికి చెందిన 22 మంది అందులో మంత్రులు చేసినవారు, కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వెళ్ళి గెలిచినవారు ఏ పార్టీ అని తమ అధ్యక్షుడిపై విమర్శలు చేసే నైతికత వీరికి ఎక్కడిది అంటూ నిలదీశారు. మోడీ సాయం లేకుండా చంద్రబాబు జీరో అన్నది పచ్చి వాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రధాని ఎన్నో చేశారని చిన్న అంశాలు పెద్దవి చేసి బీజేపీని బద్నాం చేస్తున్నారని సోము ఆరోపించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- cbi enquiry
- janasena party
- nara chandrababu naidu
- pavan kalyan
- somu veerraju
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సీబీఐ విచారణ
- సోము వీర్రాజు
