Thu Mar 19 2026 04:38:34 GMT+0530 (India Standard Time)
రాహుల్ భేటీలో నారా బ్రాహ్మణి

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించే సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన నేపథ్యంలో వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక వేత్తలతో రాహుల్ గాంధీ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి నారా బ్రాహ్మణి హాజరవుతున్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, పరిశ్రమలకు ఏ విధంగా ప్రోత్సాహకాలు అందించాలన్న దానిపై రాహుల్ వారిని అడిగి తెలుసుకోనున్నారు.
Next Story

