Sat Mar 21 2026 15:57:06 GMT+0530 (India Standard Time)
నన్నపనేని డిమాండ్ వింటే...?

పురుషులపై మహిళలు దాడులు చేస్తున్న సంఘటనలనై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్రలో వరుసగా పురుషులపై మహిళలు దాడులు చేసిన సంఘటనలు దురదృష్టకరమన్నారు. భార్యల చేతిలో దాడులకు గురైన వారిని త్వరలోనే పరామర్శిస్తానని స్పష్టం చేశారు. మహిళల నుంచి పురుషులను కాపాడేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు. టీవీ సీరియళ్లు మహిళల్లో క్రూరత్వం పెంచుతున్నాయని, టీవీ సీరియళ్లపై కూడా సెన్సార్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇందుకోసం కేంద్రానికి లేఖ రాసిన స్పందన రాలేదన్నారు.
Next Story

