Sun Mar 08 2026 07:50:24 GMT+0530 (India Standard Time)
నన్నే టార్గెట్ చేశారు
తనపై టీడీపీ నేతలు కావాలని దాడులు చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తనపై దాడి [more]
తనపై టీడీపీ నేతలు కావాలని దాడులు చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తనపై దాడి [more]

తనపై టీడీపీ నేతలు కావాలని దాడులు చేస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మహిళను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తనను కాలర్ పట్టుకోవడమే కాకుండా రైతుల ముసుగులో కొందరు టీడీపీ కార్యకర్తలు కారం చల్లారని కూడా నందిగం సురేష్ ఆరోపించారు. దళితుడనే తనపై వరసగా టీడీపీ దాడులకు దిగుతుందని నందిగం సురేష్ ఆరోపించారు. తనపై దాడి వెనక ఉన్న టీడీపీ నేతలను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు. గతంలోనూ నందిగామలో తనపై దాడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Next Story