Sun Mar 22 2026 07:14:43 GMT+0530 (India Standard Time)
బాలయ్య మరోసారి ....?

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమానులపై మరోసారి అసహనం ప్రదర్శించారు. చేయి చేసుకున్నారు. దీంతో అభిమానులు ఆయన ఫ్లెక్సీలను తగులబెట్టడం చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన బాలయ్య నలుగురు అభిమానులపై చేయిచేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద బాలకృష్ణ కాన్వాయ్ వస్తుండగా నలుగురు అభిమానులు ఆయనను అడ్డగించి చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. అయితే సహనం కోల్పోయిన బాలకృష్ణ వాహనం దిగి మరీ వారిపై చేయిచేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బాలయ్య అభిమానులు ఆయన ఫ్లెక్సీని తగులపెట్టారు. బాలకృష్ణ తన అభిమానులపై చేయి చేసుకోవడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనే ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినా బాలయ్య మాత్రం తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

