Sun Mar 15 2026 17:24:36 GMT+0530 (India Standard Time)
బాలకృష్ణకు ఎదురుగా జగన్.. ఏం జరిగిందంటే?
నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఇద్దరూ నమస్కరించుకున్నారు.

నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఇద్దరూ నమస్కరించుకున్నారు. నవ్వుతూనే పలకరించుకున్నారు. పద్మాలయా స్టూడియోస్ లో ఈ ఘటన జరిగింది. తొలుత నందమూరి బాలకృష్ణ పద్మాలయా స్టూడియోస్ కు వచ్చి కృష్ణ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలసి వారిని పరామర్శిస్తున్నారు.
అక్కడే ఉన్న...
బాలకృష్ణ అక్కడే ఉన్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కృష్ణకు నివాళులర్పించేందుకు పద్మాలయా స్టూడియోస్ కు వచ్చారు. నివాళులర్పించిన అనంతరం జగన్ మహేష్ బాబు కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నారు. వారిని పరామర్శిస్తున్న సమయంలో వెనక ఉన్న బాలకృష్ణ జగన్ కు నమస్కరిస్తూ ముందుకు వచ్చారు. వెంటనే జగన్ కూడా ప్రతి నమస్కారం చేసి బాలకృష్ణను నవ్వుతూ పలకరించడం కనిపించింది.
Next Story

