Fri Jan 30 2026 11:36:36 GMT+0000 (Coordinated Universal Time)
ఏయ్...తాట తీస్తా..మళ్లీ విశ్వరూపం చూపిన బాలయ్య

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బలకృష్ణతో మాట్లాడాలంటే వెనకాముందు చూసుకోవాలి. ఆయనతో జాగ్రత్తగా లేకపోతే చెంపలు వాచిపోతాయి. ఈ విషయంతో ఇప్పటికే కొందరు అనుభవం పొందారు. అయితే, తాజాగా ఆయన మరోసారి తన విశ్వరూపం చేపారు. ఈ సారి సొంత పార్టీ నేతలే ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపురం ప్రజల బాగోగులు చూసేందుకు ఆయన నియోజకవర్గ పర్యటన పెట్టుకున్నారు. చిలమత్తూరు మండలంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేశారు. అయితే, బాలయ్య ముందే టీడీపీ నేతలు పంచాయితీకి దిగడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఏయ్ నాముందే తామాషాలా.. తాట తీస్తా అని గద్దించారు. దీంతో బాలయ్యకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలిసిన నేతలు కిమ్మనకుండా కూర్చున్నారు. ఇప్పటి నుంచి జరిగిందేదో జరిగింది, ఇక నుంచి ఇటువంటివి చేస్తే నా విశ్వరూపం చూపిస్తా అని హెచ్చరించారు.
Next Story

