Mon Mar 23 2026 16:21:07 GMT+0530 (India Standard Time)
నల్లారి ఇలా అనేశారేంటి?

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఏమీ ఉండదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి ఖాయమైపోయినట్లేనని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. పీలేరులో తన గెలుపుకు తమ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారన్నారు. తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆశీస్సులుకూడా తనకు ఉన్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎక్కువ సంఖ్యలో నియోజకవర్గాలను కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
Next Story

