Mon Feb 02 2026 15:52:26 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి... నల్లారి...?

తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాలేదు. ఆయన ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతోంది. దీనికి కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. మొత్తం మీద రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి బెజవాడకు వస్తున్న కిరణ్ కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
Next Story
