Wed Mar 18 2026 07:42:00 GMT+0530 (India Standard Time)
ధర్నాకు దిగిన ప్రసన్న కుమార్ రెడ్డి
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిన్న కోవూరు నియోజకవర్గం పరిధిలో ప్రసన్న కుమార్ రెడ్డి పేదలకు నిత్యావసర [more]
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిన్న కోవూరు నియోజకవర్గం పరిధిలో ప్రసన్న కుమార్ రెడ్డి పేదలకు నిత్యావసర [more]

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిన్న కోవూరు నియోజకవర్గం పరిధిలో ప్రసన్న కుమార్ రెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్స్ ను పాటించలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా పట్టించుకోలేదని వార్తలు రావడంతో ఉన్నతాధికారులు ఎమ్మెల్యేతో పాటు పోలీసులకు కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి అభ్యంతరం చెబుతూ తాను మంచి పనిచేస్తున్నా నోటీసులు ఏంటని ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులకు మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
Next Story