Sun Mar 22 2026 01:20:16 GMT+0530 (India Standard Time)
టీఆర్ఎస్ కు షాక్

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బాలూనాయక్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన గురువారం పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాలూనాయక్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరిన ఆయన దేవరకొండ నియోజకవర్గం టిక్కెట్ ను ఆశించారు. అయితే, ఈ టిక్కెట్ ను సిట్టింగ్ అయిన రవీంద్రకుమార్ కు కేసీఆర్ కేటాయించడంతో బాలూనాయక్ అసంతృప్తి పార్టీని వీడారు. కాంగ్రెస్ తరపున దేవరకొండ స్థానంలో ఆయన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Next Story

