Mon Mar 23 2026 16:24:57 GMT+0530 (India Standard Time)
గవర్నర్ పై ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గవర్నర్ నరసింహన్ ను 11 ఏళ్లుగా ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ వ్యవస్థకే కళంకం తెస్తున్నారన్నారు నక్కా ఆనందబాబు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన గవర్నర్ ను సాగనంపాల్సిందేనని నక్కా డిమాండ్ చేశారు. కేంద్రానికి అడుగలకు మడుగులు వత్తుతూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. గుళ్లు, గోపురాలు తిరగడం తప్ప ఆయన సాధించిందేమిటని నక్కా నిలదీశారు.
Next Story

