Wed Mar 18 2026 17:30:49 GMT+0530 (India Standard Time)
జగన్ కు మద్దతిచ్చిన మరో సినీ ప్రముఖుడు

పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటులు పోసాని కృష్ణమురళి, పృధ్వి జగన్ ను కలిసి తమ మద్దతు ప్రకటించగా, సోమవారం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ ను కలిశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో ఆయన జగన్ ను కలిసి మాట్లాడారు. రాజన్న రాజ్యం రావాలంటే వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు.

Next Story

