Thu Mar 19 2026 15:16:00 GMT+0530 (India Standard Time)
నాగార్జున ఫామ్ హౌజ్ లో విషాదం

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడలోని హీరో అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అందులో పనిచేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ తో మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు (36), దుర్గ (32) దంపతులు నాగార్జునకు వ్యవసాయం క్షేత్రంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో కరెంట్ పోవడంతో పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్ తీగను గమనించకుండా తాకగా కరెంట్ షాక్ తగిలింది. భర్త విలవిల్లాడుతుండటం చూసి అతన్ని కాపాడేందుకు దుర్గ ప్రయత్నించగా, ఆమెకూ షాక్ కొట్టింది. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Next Story

