Thu Mar 19 2026 23:16:17 GMT+0530 (India Standard Time)
నాగ్ ఎమోషనల్ ట్వీట్..!

నందమూరి హరికృష్ణ మృతికి సినీ నటుడు అక్కినేని నాగార్జున సంతాపం ప్రకటించారు. ఈ మేరకు నాగార్జున చేసిన ట్వీట్ కంటతడిపిస్తుంది." నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే ఆయన నాతో అన్నారు కానీ ఇప్పుడు ఆయన ఇక లేరు, మిస్ యూ అన్న" అని చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు నాగ్.
అన్నదమ్ములుగా నటించడంతో...
గతంలో 'సీతారామరాజు' సినిమాలో హరికృష్ణ, నాగార్జున అన్నాదమ్ములుగా నటించారు. నాగ్ ఆ సినిమాకు సంబంధించి ఓ ఫోటో షేర్ చేస్తూ ఆలా ట్వీట్ చేశాడు. ఇక కాజల్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, సాయిధరమ్ తేజ్, హరీశ్ శంకర్, దేవీశ్రీ ప్రసాద్, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్, అల్లు శిరీష్, కోన వెంకట్ తదితదురులు హరికృష్ణకు సంతాపం తెలియజేశారు. సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టినరోజు.
Next Story

