Mon Mar 23 2026 00:33:25 GMT+0530 (India Standard Time)
నాదెండ్ల ఓపిక పట్టలేరా?

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను జనసేన పార్టీలో చేర్చుకోవడం అనైతికమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ చెప్పేదొకటి...చేసేదొకటి అన్నారు. నాదెండ్ల మనోహర్ కు పార్టీ అత్యున్నత పదవులను ఇచ్చిందని, అవన్నీ మర్చి పోయి నాదెండ్ల పార్టీని వీడటం సరికాదన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడిన వారే నిజమైన కార్యకర్త అని రఘువీరా చెప్పారు. నాదెండ్ల మరికొంత కాలం వెయిట్ చేయలేరా? అని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. నాదెండ్ల పార్టీని వీడినా జరిగే నష్టమేమీ లేదన్నారు.
Next Story

