Sun Mar 22 2026 23:03:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జనసేనలో చేరిన నాదెండ్ల

జనసేన పార్టీలోకి కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ చేరిపోయారు. విజయవాడలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వచ్చిన నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్ విజయవాడ చేరుకున్నారు. నాదెండ్ల రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించార. బలమైన ఆలోచన, లోతైన విశ్లేషణ నాదెండ్ల సొంతమన్నారు. ఇకపై జనసైనికుడిగా పనిచేస్తానని నాదెండ్ల మనోహర్ చెప్పారు. పవన్ ఆలోచన, నిజాయితీ, సామాజిక స్పృహ తనకు ఇష్టమని, అందుకే తాను జనసేనలో చేరినట్లు నాదెండ్ల చెప్పారు.
Next Story

