బిగ్ బ్రేకింగ్ : ముషారఫ్ కు మరణ శిక్ష
పాక్ మాజీ ప్రధాని ముషారఫ్ కు మరణ శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనం తీర్పు చెప్పింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం [more]
పాక్ మాజీ ప్రధాని ముషారఫ్ కు మరణ శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనం తీర్పు చెప్పింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం [more]

పాక్ మాజీ ప్రధాని ముషారఫ్ కు మరణ శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ధర్మాసనం తీర్పు చెప్పింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ముషారఫ్ తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయ పడింది. దేశద్రోహం కేసులో ముషారఫ్ ను దోషిగా సుప్రీంకోర్టు తేల్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు ముషారఫ్ కు మరణ దండన విధించడాన్ని సమర్థించారు. ప్రస్తుతం పర్వేజ్ ముషారఫ్ విదేశాల్లో తలదాచుకున్నారు. దుబాయ్ లో ఉంటున్నారు. 2007లో ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలనతో అధికారాన్ని చేజిక్కించు కోవడంపై కేేసు నమోదయింది. 2013లో ఈ కేసు నమోదయింది.