Tue Feb 03 2026 00:35:43 GMT+0000 (Coordinated Universal Time)
భర్తను చంపడంలో భార్య కొత్త టెక్నిక్

భర్తలను హత్య చేయడంలో భార్యలు కొత్త దారులు వెదుక్కుంటున్నారు. బొద్దింకలను చంపే హిట్ తో ఓ భార్య మొగుడిని చంపిన తీరు ఆశ్చర్యపడుతోంది. జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ లో గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జగన్, దేవిక దంపతులు కాపురముంటున్నారు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లైన దగ్గర నుంచే గొడవలు ప్రారంభమయ్యాయి. రాత్రి భర్త జగన్ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య దేవికతో గొడవ పడ్డాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న జగన్ నోట్లో హిట్ కొట్టడంతో ఊపిరి అందక చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవికను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story
