Thu Mar 19 2026 15:28:53 GMT+0530 (India Standard Time)
లాలూ కుమారుడి హత్యకు కుట్ర..?

తనను చంపేందుకు కుట్ర జరిగిందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్సెస్ కలిసి తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా సొంత నియోజకవర్గం మహువా ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు చెబుతుండగా ఆయుధం ధరించిన ఓ వ్యక్తి తనను గట్టిగా పట్టుకున్నాడని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. గన్ మెన్ తో పాటు పక్కనున్న వారు అప్రమత్తం కావడంతో తప్పించుకున్నానని వెల్లడించారు.
Next Story

