Mon Mar 23 2026 13:56:07 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 160 సీట్లు వస్తాయా సార్ అంటూ...

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ రావడానికి ఎయిర్ పోర్టులో వచ్చిన జగన్ లాంజ్ లో నుంచి బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళుతుండగా ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి జగన్ దగ్గరకు వచ్చాడు. 160 సీట్లు వస్తాయా సార్ అని అడుగుతూ పలకరించి ఒక్కసారిగా పందెంకోడికి కట్టే కత్తితో మెడపై దాడికి యత్నించాడు. వెంటనే జగన్ అప్రమత్తమై పక్కకు జరగగా భూజానికి తాకింది. దీంతో కత్తి బలంగా జగన్ ఎడమచేతి పైభాగంలో దిగింది. వెంటనే భద్రతా సిబ్బంది తేరుకుని నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అయితే, అతడిని ఏమీ అనవద్దని, పోలీసులకు అప్పగించాలని జగన్ వారించాడు. పెందెంకోడికి కత్తి కావడంతో కత్తికి విషయం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్ పోర్టులోనే జగన్ కు చికిత్స జరుగుతోంది.
Next Story

