Sat Jan 31 2026 05:39:46 GMT+0000 (Coordinated Universal Time)
భార్యను హత్య చేసి గోనె సంచిలో కుక్కి....?

ఓ మహిళను హత్య చేసి దానిని బియ్యపు బస్తాలో ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ సమీపం లో పడేశారు.పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరం లో ఈ ఘటన జరిగింది. సంచి నుండి రక్తం కారుతుండటం తో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాతబస్తీలో ని డబీర్ పురా రైల్వే స్టేషన్ పక్కన బ్యాగ్ కలకలం రేపింది. బ్యాగ్ లో మహిళ మృతదేహం ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. భర్తే హత్యచేసి బ్యాగ్ లో ప్యాక్ చేసి పరారయ్యాడని పోలీసులు చెబుతున్నారు. మృతురాలు పాతబస్తీకి చెందిన అక్బర్ హైదర్ అలీ మూడో భార్య గా గుర్తించారు అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు చేదు అనుభవం ఎదురయింది. మూడో భార్యను హత్య చేసి పిల్లలతో సహా దుబాయ్ కి పరరాయ్యడు అక్బర్. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీ తరలించారు. అక్బర్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Next Story
